మెక్సికోలో డ్రగ్స్‌ డాన్‌ హతం చెలరేగిన హింస.. భారతీయులూ జాగ్రత్త

మెక్సికోలో డ్రగ్స్‌ డాన్‌ హతం చెలరేగిన హింస.. భారతీయులూ జాగ్రత్త


మెక్సికోలో డ్రగ్ మాఫియా నేత ‘ఎల్ మెంచో’ సైనిక దాడిలో చనిపోవడంతో ఆ దేశంలో హింస చెలరేగింది. మెక్సికో సైన్యం, అమెరికా నిఘా వర్గాల సహకారంతో జరిపిన ఆపరేషన్‌లో ఎల్ మెంచో ప్రాణాలు కోల్పోయాడు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 15 మిలియన్ డాలర్ల అంటే సుమారు 125 కోట్ల రూపాయల భారీ రివార్డును ప్రకటించింది. భారత ఐటీ నిపుణులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలంటూ మెక్సికోలోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. ఎల్ మెంచో స్థానం కోసం డ్రగ్‌ కార్టెల్‌లో అంతర్గత పోరు మొదలైంది. ఇది మరింత రక్తపాతానికి దారితీసే ప్రమాదం ఉంది. తమ నాయకుడు ఎల్ మెంచో మరణానికి ప్రతీకారంగా ‘జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్’ సభ్యులు హింసకు పాల్పడుతున్నారు. హైవేలపై వాహనాలను నిలిపి నిప్పంటిస్తున్నారు. దాంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఎల్ చాపో తర్వాత అంతటి పేరున్న, అంతకంటే క్రూరుడిగా పేరున్న మెక్సికన్ డ్రగ్ లార్డ్ ‘ఎల్ మెంచో. ఒకప్పుడు కూలీగా పనిచేసిన వ్యక్తి, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నేరస్తుడిగా మారాడు. అమెరికాకు అక్రమంగా వలస వెళ్లి అక్కడ హెరాయిన్ కేసులో పట్టుబడి జైలు శిక్ష తర్వాత మెక్సికోకు తిరిగొచ్చి పోలీసు అధికారిగా చేరాడు. కానీ, నేర ప్రవృత్తి అతడిని తిరిగి మాఫియా వైపు నడిపించింది. అమెరికాలో లక్షల మంది మరణానికి కారణమవుతున్న ‘ఫెంటానిల్’ డ్రగ్స్ సరఫరాలో మెంచోదే కీలక పాత్ర.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాక్‌ ఉగ్రవాదులను పట్టించిన ‘టైసన్’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *