78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలు..

78 ఏళ్ల వయసులో 12  బంగారు పతకాలు..


78 ఏళ్ల వయసులో 12  బంగారు పతకాలు..

బామ్మకు మనవడు అండగా ఉంటానంటూ నారా లోకేష్ ట్వీట్

జీవితంలో ఏదైనా సాధించాలంటే వయస్సు, వైకల్యం, చదువు, ఇవేవీ అడ్డు కాదని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన 78 ఎల్లా వృద్ధురాలు తనకు వయసు కేవలం ఒక అంకెమాత్రమేని అంటుంది. ఏదైనా సాధించేందుకు వయసుకి సంబంధం లేదంటూ నిరూపించింది. 78 ఏళ్ల వయసులో రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి రన్నింగ్ పోటీల్లో సత్తా చాటి ఏకంగా 12 బంగారు పతకాలను సాధించింది 2016లో మొదలైన ఈ 78 ఏళ్ల వెటరన్ క్రీడాకారిని గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నెల్లూరు జిల్లా కావలికి చెందిన రామసుబ్బమ్మ మహిళ అక్కడే సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకానికి సంబంధించి వంట మనిషిగా పనిచేస్తుంది. ఆ పాఠశాలలో సాయంత్రం వేళ విద్యార్థులు ఆటల పోటీలు పాల్గొనడం ఆమె చూసేది.. ఇలా ప్రతిరోజు విద్యార్థుల క్రీడల పోటీల్లో పాల్గొనడం చూడటం పట్ల తాను కూడా క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. దీంతో రామసుబ్బమ్మకు కూడా రన్నింగ్ వాకింగ్ చేయాలనే తపన మొదలైంది. ఈ విషయం చుట్టుపక్కల వారికి చెబితే ఈ వయసులో వాకింగ్ రన్నింగ్ పోటీలు అవసరమా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే తనకు వయస్సు కేవలం అంకె మాత్రమే అని 2016లో రామసుబ్బమ్మ క్రీడాకారిణిగా తన ప్రయాణం మొదలుపెట్టింది. పాఠశాల గ్రౌండ్ తో పాటు బయట మైదానాల్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది రన్నింగ్ పట్ల తనకున్న ఆసక్తి ఆ క్రీడా కారినికి 12 బంగారు పతకాలు ఎనిమిది రజిత పథకాలు సాధించేలా చేసింది. 2017 నుంచి అలుపెరగకుండా 500 ,800, 1500 మీటర్ల పరుగు పందాలతో పాటు మూడు వేల మీటర్ల నడక పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అయితే 12 బంగారు పతకాలు , ఎనిమిది రజిత పథకాలు సాధించి రాష్ట్ర జాతీయ స్థాయిలో సత్తా చాటుకున్నా అంతర్జాతీయ పోటీలే తన లక్ష్యం అంటున్నారు క్రీడాకారిణి రామసుబ్బమ్మ. భర్త చనిపోవడం పిల్లలు నెల్లూరులో పనులు చేసుకుంటూ ఉండగా రామసుబ్బమ్మ మాత్రం కావలిలోనే ఉంటూ అక్కడక్కడ పనులు చేసుకుంటూ అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నారు. 78 ఏళ్ల వయసులో పరుగు పందాలు సాధ్యం కాకపోయినా ఆమె మాత్రం పట్టు వదలకుండా అంతర్జాతీయ పోటీలపై దృష్టి సారించింది. క్రీడాకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తుంది రామసుబ్బమ్మ.

మంత్రి లోకేష్ ట్వీట్..

కావలి కి చెందిన రామసుబ్బమ్మ గురించి తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో స్పందించారు.80 ఏళ్ల వయసులో రామ సుబ్బమ్మ సాధిస్తున్నపతకాలు చూసి గర్వంగా ఉందన్నారు. జాతీయ స్థాయిలో పోటీ పడాలి అనుకునే బామ్మ గారికి ఈ మనవడు లోకేష్ అండగా నిలవడమే కాక ఏ సాయం కావాలన్నా అందిస్తానంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు మంత్రి లోకేష్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *