60 Seconds Plank Challenge: రోజుకు ఒక్క నిమిషం చాలు.. మీ శరీరాకృతిని మార్చేసే ‘మ్యాజిక్’ వ్యాయామం!

60 Seconds Plank Challenge: రోజుకు ఒక్క నిమిషం చాలు.. మీ శరీరాకృతిని మార్చేసే ‘మ్యాజిక్’ వ్యాయామం!


Plank Challenge..

కేవలం రోజుకు ఒక్క నిమిషం కేటాయిస్తే చాలు, మీ శరీరాకృతిని మార్చేయగల శక్తి ఒక వ్యాయామానికి ఉంది. అదే ‘ప్లాంక్’. ప్రముఖ న్యూట్రిషనిస్ట్, హెల్త్ కోచ్ నేహా రంగ్లానీ ప్లాంక్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. బరువు తగ్గడం కంటే శరీరం లోపల దృఢంగా ఉండటం చాలా ముఖ్యం. చాలా మందికి బరువు సమస్య కంటే ‘కోర్’ బలహీనంగా ఉండటం పెద్ద సమస్యగా మారింది. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల మన వెన్నెముకకు మద్దతు ఇచ్చే కండరాలు మొద్దుబారిపోతున్నాయి. దీనివల్ల నడుము నొప్పి, గ్యాస్ సమస్యలు, తగ్గని పొట్ట వేధిస్తుంటాయి. అయితే, వీటన్నింటికీ చెక్ పెట్టేలా రోజుకు కేవలం 60 సెకన్లు చేసే ఒకే ఒక్క వ్యాయామం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ పవర్‌ఫుల్ ఎక్సర్‌సైజ్ మరేదో కాదు.. ప్లాంక్.

కోర్ అంటే..

చాలా మంది కోర్ అంటే కేవలం సిక్స్ ప్యాక్ యాబ్స్ అనుకుంటారు. కానీ, కోర్ అంటే మన వెన్నెముకను చుట్టి ఉంచే ఒక రక్షణ కవచం లాంటిది. ఇది మన అవయవాలకు మద్దతు ఇస్తుంది, పెల్విస్‌ను స్థిరంగా ఉంచుతుంది మరియు నడుము కింది భాగాన్ని రక్షిస్తుంది. కోర్ బలంగా ఉంటే నడవడం, నిలబడటం, జీర్ణక్రియ కూడా సులభతరం అవుతాయని నేహా రంగ్లానీ వివరిస్తున్నారు.

  • ప్లాంక్ చేయడం వల్ల మన శరీరంలోని లోతైన కండరాలు మళ్ళీ ఉత్తేజితం అవుతాయి. ఇది కేవలం శారీరక శక్తినే కాకుండా, ఒత్తిడిలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం ఎలాగో నేర్పుతుంది. సరైన భంగిమ, మెరుగైన జీవక్రియ, శక్తి స్థాయిలు పెరగడానికి ఇది తోడ్పడుతుంది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా చేయాల్సిన వ్యాయామం ఇది.
  • ప్లాంక్ చేయడానికి ప్రత్యేక సమయం అక్కర్లేదు. ఆఫీసులో మీటింగ్‌ల మధ్యలో లేదా స్నానానికి వెళ్లే ముందు కూడా చేయవచ్చు. ప్రారంభంలో రోజుకు 20-30 సెకన్లు రెండు సార్లు ప్రయత్నించండి. కొన్నాళ్లయ్యాక 45-60 సెకన్లు మూడు సార్లు చేయండి. పూర్తిగా అలవాటయ్యాక 60-90 సెకన్లు మూడు సార్లు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
  • ప్లాంక్ చేసేటప్పుడు శ్వాసను బిగబట్టకూడదు. నడుము కిందికి వంగిపోకుండా, భుజాలు పైకి ఎగబాకకుండా చూసుకోవాలి. కండరాలను బిగబట్టి, నెమ్మదిగా శ్వాస తీసుకోవడమే సరైన పద్ధతి. అయితే, తీవ్రమైన వెన్నునొప్పి ఉన్నవారు, రక్తపోటు సమస్య ఉన్నవారు, గర్భిణీలు ఈ వ్యాయామానికి దూరంగా ఉండటం మంచిది.
  • ఒక్క 30 రోజుల పాటు ఈ 60 సెకన్ల ప్లాంక్ ఛాలెంజ్ ప్రయత్నించి చూడండి. మీ శరీరంలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. క్రమం తప్పకుండా చేయడం ఒక్కటే ఇందులో అసలైన రహస్యం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *