49 ఏళ్ల వయసులో ఓ తల్లి అసాధారణ ప్రతిభ.. కూతురుతోపాటు NEET పరీక్ష రాసి మెడికల్ కాలేజీలో సీటు!

49 ఏళ్ల వయసులో ఓ తల్లి అసాధారణ ప్రతిభ.. కూతురుతోపాటు NEET పరీక్ష రాసి మెడికల్ కాలేజీలో సీటు!


ఎంతో కఠినమైన నీట్‌ పరీక్ష క్రాక్‌ చేయడం అంత సులువు కాదు. ఇందుకు అహర్నిశలు కష్టపడి ప్రిపరేషన్‌ సాగించాలి. యేటా లక్షలాది మంది నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు తలకిందులుగా తపస్సు చేస్తుంటారు. అయితే తమిళనాడుకు చెందిన 49 ఏళ్ల మహిళ తన తొలి ప్రయత్నంలోనే సులువుగా నీట్ పరీక్షలో ర్యాంకు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. కూతురుతోపాటు నీట్‌ పరీక్ష రాసి దేశానికి స్ఫూర్తినిచ్చేలా ఘనత సాధించింది.

తమిళనాడుకు చెందిన అముతవల్లి మణివన్నన్ (49), ఆమె కుమార్తె సంయుక్త 2024లో నీట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఫిజియోథెరపిస్ట్ అయిన అముతవల్లి తన చిన్న తనంలో MBBS చదవాలని కలలు కనింది. కానీ కుటుంబం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కలను నెరవేర్చుకోలేకపోయింది. అయితే విధి ఆమెకు వేరే ప్రణాళిక వేసింది. మూడు దశాబ్దాల తర్వాత ఆమె కలను సాకారం చేసుకోవాలనే సంకల్పం మళ్ళీ రగిలింది. చివరికి ఆమె పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలిగింది. తన కూతురు నీట్ కి ప్రిపేర్ అవడం చూసిన తర్వాత తన కల మళ్ళీ చిగురించింది. ఆమె నాకు గొప్ప స్ఫూర్తని అమృతవల్లి అంటున్నారు. ప్రిపరేషన్ కోసం సంయుక్త ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది. దీంతో ఆమె తల్లి కూడా ప్రిపరేషన్ ప్రారంభించింది. సంయుక్త స్టడీ మెటీరియల్ అముతవల్లి చదివింది. నీట్‌ ఫలితాల్లో సంయుక్త 450 మార్కులు సాధించగా, ఆమె తల్లి అముతవల్లి 147 మార్కులు సాధించింది. 2025లో సంయుక్త జనరల్ కోటాలో తమిళనాడు వెలుపల సీటు పొందగా.. ఆమె తల్లి విరుధునగర్‌లోని ప్రభుత్వ వైద్య కాలేజీలో పీడబ్ల్యుబీడీ కేటగిరీ కింద సీటు పొందింది. భర్త చాలా సహాయకారిగా ఉన్నాడని, ఆయన తమ ఇద్దరినీ చదువుకునేందుకు ప్రోత్సహించారని అముతవల్లి మీడియాకు తెలిపారు.

నీట్‌లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం వంటి అంశాలను కవర్ చేసే విస్తృతమైన సిలబస్ ఇందులో ఉంటుంది. ఇది టీనేజ్‌లోని విద్యార్థులకు ఎంతో కఠినమైన సిలబస్. కానీ అముతవల్లి దశాబ్దాల తర్వాత మళ్లీ పుస్తకం పట్టి తన కలను నెరవేర్చుకున్నారు. అముతవల్లి ప్రయానం లక్షలాది మందికి స్పూర్తి దాయకం. వయసు కేవలం నంబర్‌ మాత్రమే అని, ఏ వయసులోనైనా కలలను పునరుజ్జీవింపజేయవచ్చని అముతవల్లి మరోమారు నిరూపించింది. ఎదురుదెబ్బలు మిమ్మల్ని ఆపాల్సిన అవసరం లేదని, దృఢ సంకల్పం లైఫ్‌లో రెండో అవకాశాన్ని అన్‌లాక్ చేయగలదని ఇలాంటి అసాధారణ కథలు గొప్ప ఉదాహరణలుగా నిలుస్తాయ.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *