Headlines

24 గంటలు ఏసీ వాడినా కరెంట్ బిల్ 100 దాటకూడదంటే..ఈ స్మార్ట్‌ టిప్స్‌ ట్రై చేయండి.. బోలెడు డబ్బులు ఆదా!

24 గంటలు ఏసీ వాడినా కరెంట్ బిల్ 100 దాటకూడదంటే..ఈ స్మార్ట్‌ టిప్స్‌ ట్రై చేయండి.. బోలెడు డబ్బులు ఆదా!


24 గంటలు ఏసీ వాడినా కరెంట్ బిల్ 100 దాటకూడదంటే..ఈ స్మార్ట్‌ టిప్స్‌ ట్రై చేయండి.. బోలెడు డబ్బులు ఆదా!

వేసవిలో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండవేడి తీవ్రంగా ఉండడంతో కార్యాలయాలు, ఇళ్లలో ఏసీ వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే, ఏసీలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలి..? విద్యుత్ బిల్లులను ఎలా తగ్గించుకోవాలి అనే విషయాలపై చాలా మందికి అవగాహన ఉండదు. కానీ, ఏసీ వాడకంలో అత్యంత ముఖ్యమైన విషయం సరైన ఉష్ణోగ్రతను సెట్ చేయడం అంటున్నారు ఏసీ ఇంజనీర్లు. చాలా మంది తక్కువ ఉష్ణోగ్రతలో (18-23 డిగ్రీలు) ఏసీని పెట్టి, దుప్పటి కప్పుకొని పడుకుంటూ ఉంటారు. కానీ, ఇది సరైనది కాదు.. ఇది అనవసరంగా విద్యుత్ ఖర్చును పెంచుతుంది.

సాధారణంగా, 25-26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మన శరీరానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత వద్ద ఏసీని సెట్ చేసి, ఫ్యాన్‌ను తక్కువ వేగంతో ఆన్ చేసుకుంటే, చల్లటి గాలి సరైన వేగంతో వ్యాపించి, మీరు త్వరగా సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు. ఈ పద్ధతిలో ఏసీ థర్మోస్టాట్ మీద ఆధారపడి ఆన్-ఆఫ్ అవ్వడం వల్ల కరెంటు వినియోగం తగ్గి, కనీసం 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది.

ఎండలో నుంచి ఇంటికి వచ్చిన వెంటనే 18 డిగ్రీలకు ఏసీని పెట్టాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. బయట వేడి వాతావరణం నుండి వచ్చినప్పుడు, 25-26 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. శరీర ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రతకు అలవాటు పడటానికి 5 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత ఇంకా ఎక్కువ సౌకర్యం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఏసీ నిర్వహణ అనేది దాని జీవితకాలానికి, పనితీరుకు చాలా ముఖ్యం. ఏసీని ఏడాదికి రెండుసార్లు సర్వీసింగ్ చేయించుకోవాలని నిపుణులు సూచించారు. వేసవి కాలం ప్రారంభానికి ముందు ఒకసారి, వేసవి తర్వాత ఒకసారి సర్వీసింగ్ చేయించడం ఉత్తమం. వేసవిలో ఏసీని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఫిల్టర్లు, కాయిల్స్ అన్నీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. సర్వీసింగ్ చేయకపోతే కూలింగ్ తగ్గి, కరెంట్ వృధా అవుతుంది.

స్వయంగా చేయగల సాధారణ నిర్వహణ చిట్కాలలో ఫిల్టర్ శుభ్రత ముఖ్యమైనది. ఏసీ ఫిల్టర్లను ప్రతి 15 రోజులకు లేదా నెలకు ఒకసారి శుభ్రం చేసుకోవాలని ఏసీ టెక్నీషియన్లు సాధారణంగా సూచిస్తారు. ఫిల్టర్ బ్లాక్ అయితే గాలి ప్రవాహం తగ్గి, కంప్రెసర్ ఎక్కువ పనిచేసి కూలింగ్ తగ్గుతుంది. ఫిల్టర్లను తీసి నీటితో శుభ్రం చేసి, పూర్తిగా ఆరిన తర్వాత మళ్లీ అమర్చాలి.

గ్యాస్ లీకేజీని గుర్తించడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. కూలింగ్ బాగా తగ్గినప్పుడు, ఫిల్టర్ శుభ్రంగా ఉన్నా, ఫ్యాన్ మోటార్ సక్రమంగా పనిచేస్తున్నా, కంప్రెసర్ నుంచి అసాధారణ శబ్దం వస్తున్నా గ్యాస్ లీకేజీ అయ్యే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. ఏసీ గదిలోని గాలినే తిరిగి చల్లబరుస్తుంది, కేవలం 5 శాతం మాత్రమే తాజా గాలిని తీసుకుంటుంది. తాజా గాలి ప్రవేశం లేకపోతే గదిలో ఉక్కిరిబిక్కిరిగా అనిపించవచ్చు.

ఏసీని ఆఫ్ చేసిన తర్వాత వెంటనే తిరిగి ఆన్ చేయకూడదని, కనీసం 2-3 నిమిషాలు వేచి ఉండాలని నిపుణులు సూచించారు. కొన్ని ఏసీలలో టైమ్ డిలే సర్క్యూట్ ఉన్నప్పటికీ, అది పనిచేయకపోతే ఓవర్‌లోడ్ అయ్యి ట్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా ఫిల్టర్లను శుభ్రం చేయడం, పీరియాడికల్ సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల ఏసీకి సంబంధించిన మరమ్మతులు తగ్గి, ఏసీ జీవితకాలం పెరుగుతుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *