శ్రీపరాభవ నామ సంవత్సరం సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో వీరు ఎంత జాగ్రత్తగా మెదిలితే అంత మంచిది. లేకుంటే కష్టాల కడలిని ఈదాల్సిందేనంట. ఈ రాశివారికి కుటుంబ కారకుడైన గురు గ్రహం 12వ ఇంట కేతువుతో కలిసి సంచరించడం వలన పలు సమస్యలు ఎదురు అవుతాయి. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనశ్శాంతి లోపిస్తుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తికాకపోవడం, ఏ పని ప్రారంభించినా అందులో నష్టాలు ఎదురు అవ్వడం జరుగుతుంది.
అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అపనిందలు, అవమానకర సంఘటనలు ఎదురు అయ్యే ఛాన్సు ఉంది. కొన్ని సార్లు మీ మంచితనం కూడా మీకు సమస్యలను తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రారంభం మీరు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు మీ ధైర్యం కూడా పనిచేయదు. అందువలన ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో, చాలా జాగ్రత్తగా వ్యవహారించాలి. మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.
ఏదైనా పని ప్రారంభించాలి అనుకున్నా లేదా, ఏ పని చేసినా మీ ఇంటిలోని మహిళల సంప్రదింపులు తప్పనిసరి అవసరం, బంధువులతో చాలా సంతోషంగా మెదలాలి. అనవసర విషయంలోకి ఎంటర్ అవ్వకపోవడమే మంచిది. ముఖ్యంగా ఈ మొదటి మూడు నెలలు మీరు ఎంత మౌనంగా ఉంటే, మీకు అంతబాగా కలిసి వస్తుంది. సంవత్సరం చివరిలో కొన్ని సమస్యలు తొలిగిపోతాయి. ఆదాయం బాగుంటుంది. ఇక ఈ రాశి ఉద్యోగులకు అనుకూలంగా అస్సలే ఉండదు. గురు, శనులప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఉద్యోగంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అధికారుల వలన ఇబ్బందులు, సెలవలులు అధికంగా తీసుకోవడం వలన సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉంది.
విద్యార్థులకు కూడా ఇది గడ్డు కాలమే అని చెప్పాలి. కష్టానికి తగిన ఫలితం లభించదు. అన్నింట్లో నిరాశనే ఎదురు అవుతుంది. రాజకీయ నాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే పదవి సంపాదించడం కష్టమే అవుతుంది. ప్రజల్లో వ్యతిరేఖత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం కాస్త ఆశాజనకంగా ఉంటుంది. అంతగా కాకుండా మధ్యస్థ లాభాలు పొందుతారు. కానీ కొత్తగా వ్యాపారం ప్రారంభించేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.
ముఖ్యంగా సింహ రాశి స్త్రీలు ఈ సంవత్సరం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. మాట పట్టింపులు, విరోధాలు వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




