
శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. 5కి.మీ మేర ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ లోని శంషాబాద్ వద్ద గండిగూడ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న కెమికల్ ట్యాంకర్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం దెబ్బతింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది….