
Andhra Rains: తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. విలయ ప్రళయ రూపం దాల్చిన వరుణుడు
వాయువ్య, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది శుక్రవారం రాత్రి దక్షిణ ఒడిశా -ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపారు. శనివారం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో శనివారం కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే…