
Batukamma: బతుకమ్మ సంబురాలకి వేళాయె.. నేడే ఎంగిలిపూల బతుకమ్మ.. విశిష్టత ఏమిటంటే..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నం బతుకమ్మ పండగ. భాద్రప్రద మాసం అమావాస్య నుంచి ప్రారంభం అయ్యే ఈ సంబురాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ప్రకృతితో మమేకమై ఈ పండగను చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి.. వంటి రంగు రంగుల పువ్వులను బతుకమ్మగా పేర్చి .. మహిళలంతా ఒక చోటకు చేరి ఆడి పాడతారు. నేటి నుంచి (సెప్టెంబర్ 21) ఎంగిలి బతుకమ్మతో…