
ప్రకాశం జిల్లాలో దారుణం.. భార్య చికెన్ వండలేదనీ.. ఉరి బిగించుకుని భర్త సూసైడ్!
యర్రగొండపాలెం, సెప్టెంబర్ 23: మానవ బంధాలు నానాటికీ మసకబారుతున్నాయి. చిన్న కారణానికే అపర్ధాలతో మొదలై ఆత్మహత్యలతో సమస్యకు ముగింపు పలుకుతుంది నేటి యువత. తరచూ ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త ఆదివారం పూట చికెన్ వండాలని భార్యను మురిపెంగా కోరాడు. కానీ భార్య మాత్రం పంతంతో భర్తకు పచ్చడి మెతుకులు వేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త క్షణం కూడా ఆలోచించకుండా ఆత్మహత్యకు పాల్పడ్డారు….