
Tirumala: బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. సామాన్య భక్తుడికి పెద్ద పీట.. ఎక్కువ మందికి దర్శనం కలిగేలా చర్యలు
శ్రీవారి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు రానే వచ్చేశాయి. ఈ రోజు సాయంత్రం ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. స్వామివారి వైభవాన్ని కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఈ నెల 24 నుంచి అక్టోబరు 2 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు ఈ ఏడాది భక్తుల…