
Andhra Rains: ముంచుకొస్తున్న అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం రాత్రికి ఉత్తర, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల ఆనుకుని వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు….