
షాపులో చీరలు దొంగిలించిన మహిళ.. రోడ్డుపైకి ఈడ్చి కాలితో దారుణంగా కొట్టిన యజమాని ..! వీడియో
బెంగళూరు, సెప్టెంబర్ 26: బెంగళూరులో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ చీరల షాపులో దొంగతనం చేసింది. రూ. 91,500 విలువైన చీరలను దొంగిలించిందని ఆ షాపు యజమాని ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి విచక్షణా రహితంగా కాలితో తన్నాడు. మహిళ ఆర్తనాదాలు చేస్తున్నా.. ఏ మాత్రం పట్టించుకోకుండా బూతులు తిడుతూ కాలితో ఆమె కడుపులో, గుండెలపై తన్నాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో చీరల షాపు యజమాని, అతని సిబ్బందిని అరెస్టు…