
Telugu Astrology: కుజ, బుధులు యుతి.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే..!
మేషం: రాశ్యధిపతి కుజుడు సప్తమ స్థానంలో బుధుడితో కలవడం వల్ల ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు. జీవితంలో అన్ని విధాలా స్థిరత్వం ఏర్పడుతుంది. ఆస్తిపాస్తుల వివాదాలను, కోర్టు కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకుంటారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల సాకారం అయ్యే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకుంటారు. మిథునం: రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో కుజుడితో చేరడం…