
Venezuela Earthquake: భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
తాజాగా దక్షిణ అమెరికాలోని వెనిజులాలో భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 6.2 తీవ్రతతో భారీ ప్రకంపనలు వచ్చాయి. జులియా రాష్ట్రంలోని మెనేగ్రాండే ప్రాంతానికి తూర్పు-ఈశాన్య దిశలో 24 కిలోమీటర్ల దూరంలో, రాజధాని కారకాస్‌కు పశ్చిమాన 600 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నట్టు కొలంబియన్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూ అంతర్భాగంలో 7.8 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంప తీవ్రతతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు…