
డిజిటల్ ఇండియా కొత్త గుర్తింపు.. ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది.. అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిందేనా..?
భారతదేశంలో ప్రయాణ పత్రాలను ఆధునీకరించడం, భద్రపరచడం వైపు కీలక ముందడుగు పడింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ-పాస్‌పోర్ట్ సేవను ప్రారంభించింది. ఏప్రిల్ 2024లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు క్రమంగా దేశవ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలకు విస్తరిస్తోంది. ఇది జూన్ 2025 నుండి దేశవ్యాప్తంగా అధికారికంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ ఈ-పాస్‌పోర్ట్ సాంప్రదాయ భారతీయ పాస్‌పోర్ట్ లాగానే కనిపిస్తుంది. కానీ ఇందులో ఆధునిక సాంకేతికత ఉంటుంది. దీని కవర్‌లో RFID…