
Gold: షాకింగ్.. తులం బంగారం రూ.2లక్షలు దాటుతుందా.. నిజమెంత..?
భారతీయులకు బంగారం అంటే ప్రత్యేక సెంటిమెంట్. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ధరలు అంతకంతకూ పెరుగుతూ ప్రజలకు షాకిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం రూ.80వేల వద్ద ఉన్న తులం బంగారం ధర ఇప్పుడు రూ.లక్ష దాటింది. ఈ క్రమంలో గ్లోబల్ ఈక్విటీ స్ట్రాటజీ హెడ్ క్రిస్ వుడ్ తన దీర్ఘకాలిక బంగారం ధర అంచనాను పెంచారు. సమీప భవిష్యత్తులో అమెరికాలో బంగారం ధర ఔన్సుకు 6,600 డాలర్లు దాటే అవకాశం ఉందని…