
TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. బస్ ఎక్కండి.. బహుమతులు గెలుచుకోండి
దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండగ సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్ కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులను సంస్థ అందజేయనుంది. ఒక్కో రీజియన్ కు ప్రథమ బహుమతి కింద రూ.25 వేలు, ద్వితీయ బహుమతి కింద రూ.15 వేలు, తృతీయ బహుమతి కింద రూ.10 వేలను సంస్థ ప్రకటించింది. ఈ లక్కీ…