జీవితం కష్టతరమైనా.. చుట్టూ చీకటి కనిపిస్తున్నా… బతుకు మీద ఆశని వదులుకోరు కొంతమంది. తాము అనుకున్న దానిని సాధించడానికి దృఢనిశ్చయంతో పని చేస్తారు. ఓటమిపాలయ్యే కొద్దీ మునుపటి కంటే మరింత కష్టపడి ప్రయత్నిస్తారు.. తమ లక్ష్యాన్ని సాధించడానికి ఏదోక మార్గాన్ని కనుగొంటారు. ఇటీవల ఇలాంటి పరిస్థితిని అధిగమించడం ద్వారా ఫ్లోరిడాకు చెందిన 25 ఏళ్ల సామ్ రాబినోవిట్జ్ సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ పర్సన్ గా నిలిచాడు. ఈ యువకుడు తనలాంటి వారికీ స్పూర్తిగా నిలిచాడు. ఎందుకంటే
సామ్ రాబినోవిట్జ్ .. ఎకనామిక్స్ లో చదువును పూర్తి చేశాడు. డిగ్రీ పట్టా చేతికి వచ్చినప్పటి నుంచి అతను 1,000 కి పైగా ఉద్యోగ దరఖాస్తులకు అప్లై చేశాడు. అయితే ఏ సంస్థ నుంచి ఎటువంటి కాల్స్ రాలేదు. దీంతో మొదట్లో నిరాశపడ్డాడు. కానీ తనకి తానే సర్దిచెప్పుకుని ఆశని వదులుకోకుండా.. ఉద్యోగం సంపాదించడానికి అతను డిఫరంట్ గా ఆలోచించాడు. అతని ఆలోచన విధానం, తీసుకున్న చర్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఇవి కూడా చదవండి
సామ్ రాబినోవిట్జ్ 1,000 కి పైగా కంపెనీలలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు.. ఒక్కదాని నుంచి కూడా కాల్ రాకపోవడంతో కొంచెం నిరుత్సాహపడ్డాడు. ఈలోగా అతను లేబర్ డే వీకెండ్ లో జరిగిన ఒక వివాహానికి హాజరయ్యాడు. అక్కడ అతనికి ఒక ఆలోచన తట్టింది. అతను ఇంటికి తిరిగి వచ్చి ఒక ప్లకార్డ్ తయారు చేశాడు. చేతిలో ప్లకార్డ్ పట్టుకుని.. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ముందు నిలబడ్డాడు.
సామ్ ప్లకార్డుపై ఏం రాసి ఉంది?
“నేను లింక్డ్ఇన్ ద్వారా ఉద్యోగానికి ప్రయత్నించాను.. ఇమెయిల్ ద్వారా ట్రైన్ చేశాను.. ఇప్పుడు వాల్ స్ట్రీట్‌లో నిల్చుని ప్రయత్నిస్తున్నాను. నేను ఇంటర్న్‌షిప్ లేదా ఫైనాన్స్ లేదా ట్రేడింగ్‌లో ఎంట్రీ లెవల్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను.. నేను అంకితభావంతో నా ఉద్యోగ విధులను నిర్వహిస్తాను. ఎంత కష్టం అయినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను.” అనే బోర్డు మీద రాశాడు. న్యూయార్క్ వీధుల్లో సామ్ రాబినోవిట్జ్ ఉద్యోగం అడిగిన పద్ధతి వింతగా.. అదే సమయంలో ఆసక్తికరంగా మారింది. చాలా మంది ఆగి అతనితో మాట్లాడారు. చివరికి అతని కృషి ఫలించింది. ఒక IPO కంపెనీలో భాగస్వామి సామ్‌ను పిలిచి ఇంటర్వ్యూ చేశాడు. ఆ తర్వాత సామ్ కి ఒక ఉద్యోగం ఇస్తున్నట్లు చెప్పాడు.
సామ్ ఏం చెప్పాడు?
“ఇంటర్వ్యూ చేసి ఆఫీసు చూసిన తర్వాత.. నా కల నెరవేరినట్లు నాకు అనిపించింది అని సామ్ రాబినోవిట్జ్ చెప్పాడు. అంతేకాదు నాకు ఇంకా ఆఫర్ లెటర్ అందకపోయినా.. నాకు ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఇంకా ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..