హోలీ పండుగను రంగులతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే, ఈ వేడుకలో వాడే రసాయన రంగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు టీవీ9 ద్వారా హెచ్చరిస్తున్నారు. పండుగ సందర్భంగా ఉపయోగించే రంగులలో పారిశ్రామిక రంగులు, లెడ్ ఆక్సైడ్, రాగి వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉండవచ్చు. ఈ రసాయనాలు కళ్ళకు తీవ్రమైన గాయాలు, రసాయన ప్రభావం శాశ్వత నష్టాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది. కళ్లకు రంగులు తగిలినప్పుడు కెమికల్ రీ యాక్షన్ జరిగి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కళ్లకు సంబంధించిన గాయాల చికిత్స సాధారణంగా నయం అయినప్పటికీ, తీవ్రమైన సందర్భాలలో శాశ్వత నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది.
మరిన్ని వీడియోల కోసం :