హోలికా దహనంలో ఈ కలపను వాడుతున్నారా.. జాగ్రత్త

హోలికా దహనంలో ఈ కలపను వాడుతున్నారా.. జాగ్రత్త


రంగుల పండుగ హోలీకి ముందు నిర్వహించే ‘హోలికా దహనం’ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది మానవునిలోని కామ, క్రోధ, లోభ, మోహాలను దహించివేసే ఒక పవిత్ర ప్రక్రియ. ఫాల్గుణ పౌర్ణమి నాటి ఈ వేడుకలో ఏ రకమైన కలపను వాడాలో, వేటిని నిషిద్ధంగా భావించాలో పండితులు వివరిస్తున్నారు. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే వృక్షాలను హోలికా దహనంలో కాల్చడం అశుభానికి సంకేతమని పండితులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా..రావి, జమ్మి, మామిడి, ఇవి దేవతా స్వరూపాలు. శుభకార్యాల్లో తోరణాలుగా వాడే వీటిని అగ్నిలో వేయడం శాస్త్రవిరుద్ధం. ఉసిరి, వేప వంటి ఆరోగ్యప్రదాయినిలైన ఔషధ వృక్షాల కలపను, అలాగే పూజలో వాడే అరటి, బిల్వ పత్రాల కొమ్మలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. సజీవంగా ఉన్న పచ్చని చెట్లను నరికి తెచ్చి కాల్చడం ప్రకృతికి, దైవానికి ద్రోహం చేసినట్లే అంటున్నారు. శాస్త్రం ప్రకారం, నేలపై రాలి సహజంగా ఎండిపోయిన కట్టెలు, ఎండిన ఆకులు మాత్రమే సేకరించాలి. వరి పొట్టు, గోధుమ పొట్టు, ఎండిన కొబ్బరి మట్టలు వాడటం పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా గోమయంతో చేసిన పిడకలు వాడటం వల్ల గాలి శుద్ధి అవడమే కాకుండా, ఇంట్లోని ప్రతికూల శక్తులు నశిస్తాయని పెద్దలు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి 3న జరిగే ఈ పవిత్ర దహన కార్యక్రమంలో సరైన పద్ధతులు పాటించి, పర్యావరణాన్ని కాపాడుతూ దైవకృపకు పాత్రులు కావాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్విన్స్‌ డే రోజు అరుదైన ఘటన.. కవల సోదరీమణులను వివాహం చేసుకున్న కవల సోదరులు

పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త

ఇంట్లో తండ్రి మృతదేహం.. పరీక్ష హాల్లో తనయుడు పుట్టెడు దుఃఖంతో..

Jai Hanuman: లాంఛనంగా మొదలైన జై హనుమాన్ సినిమా

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌లో అవేం ఉండవు.. తేల్చేసిన హరీష్ శంకర్..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *