జనగామ జిల్లాలో అరుదైన జాతి గుడ్లగూబ ప్రత్యక్షమైంది. ఎక్కడి నుండి వచ్చిందో.. ఏమో తెలియదు.. కానీ.. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై కనిపించింది. అటుగా వెళ్తున్న వాహనదారుల కంటపడింది. అనారోగ్యంతో అవస్థ పడుతున్న ఆ గుడ్లగూబను బాటసారులు చేరదీసి.. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. గోధుమ వర్ణంలో మెరుస్తున్న ఈ గుడ్లగూబని చూసి బాటసారులు అవాక్కయ్యారు.. ఇలాంటి గుడ్లగూబను ఈ పరిసరాల్లో ఎక్కడా చూడలేదని.. ఇది అరుదైనదని భావించి.. వెంటనే అప్రమత్తమయ్యారు.. దానిని చేరదీసి ఓ బాక్స్ లో భద్రపరిచి అక్కడి నుండి నేరుగా జనగామ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.
బాటసారులు బాధ్యతగా ఈ అరుదైన పక్షిని పోలీసులకు అప్పగించారు.. పోలీసులు ఈ విషయాన్ని స్థానిక అటవీశాఖ అధికారులకు తెలపడంతో వారు వెంటనే వచ్చి పక్షి సంరక్షణ కేంద్రానికి తరలించారు. అయితే.. ఈ పక్షి గుండె ఆకారం బంగారం, తెలుపు వర్ణంతో కూడి ఆకర్షణంగా ఉంది. ఇది “ఈ బార్న్ ఓవల్ ” జాతికి చెందిన గుడ్లగూబ గా గుర్తించారు.. ఈ గుడ్లగూబ టైటో ఆల్బా శాస్త్రీయ నామంగా పిలుస్తారని, ఈ పక్షి చాలా అరుదుగా కనిపిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..