కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు తోటకూర ఆకులు , 6 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్, ఒక కప్పు బియ్యపు పిండి, అర టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను వేసుకోవాలి.
తోటకూర పేస్ట్: ముందుగా తోటకూర ఆకులు తీసుకుని మూడు సార్లు కడిగి, ఆ తర్వాత పచ్చిమిర్చి, మిక్సీ జార్లో వేసి మెత్తగా అయ్యే వరకు పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి.
పిండి కలుపుకోవడం: ఈ తోటకూర పేస్ట్ తీసుకుని ఇడ్లీ పిండిలో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి గట్టిగా ఉంటే దానిలో నీరు పోసి , ఇడ్లీ పిండి మాదిరి రెడీ చేసుకుని ఇడ్లీ పాత్రలో వేసుకోవడమే.
గ్యాస్ స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టి 15 నుంచి 20 నిముషాల అరకు పొయ్యి మీదే ఉంచి బాగా ఉడికించాలి.
ఇడ్లీలు బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని తోటకూరతో కానీ పల్లీల చట్నీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.




