స్మశానంలో దెయ్యలతో కలసి మనుషులు మందు పార్టీ.. ట్రెండ్ అవుతున్న వీడియో

స్మశానంలో దెయ్యలతో కలసి మనుషులు మందు పార్టీ.. ట్రెండ్ అవుతున్న వీడియో


సోషల్ మీడియా పాపులర్‌ అవ్వాలని చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, హైదరాబాద్ మంగళహాట్‌కు చెందిన కొందరు యువకులు మాత్రం సమాజంలో పాతుకుపోయిన అపోహలను పటాపంచలు చేయడానికి ఒక వినూత్న ఆలోచన చేశారు. అర్ధరాత్రి వేళ స్మశానవాటికలో కూర్చుని మద్యం సేవించి, దెయ్యాలు లేవు.. అనడానికి ఇదే సాక్ష్యం అంటూ సవాల్ విసిరారు. మంగళహాట్ పరిధిలోని ఇంద్రానగర్ స్మశానవాటికలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా పగలు కూడా స్మశానం వైపు వెళ్లడానికి జనం జంకుతుంటారు. అలాంటిది ఈ యువకులు అర్ధరాత్రివేళ, చిమ్మచీకటిలో నిశ్శబ్ద వాతావరణంలో సమాధుల మధ్య కూర్చుని మద్యం సేవించారు. దెయ్యాలు అనేవి కేవలం భ్రమ మాత్రమేనని, వాటికి భయపడాల్సిన అవసరం లేదని సమాజానికి చెప్పడమే తమ ఉద్దేశం అని వారు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ యువకుల ధైర్యాన్ని, మూఢనమ్మకాలపై వారు పోరాడే తీరును మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఉద్దేశం మంచిదైనా, ఎంచుకున్న మార్గం మాత్రం వివాదాస్పదంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, హైదరాబాద్ యువకుల ఈ ‘స్మశాన సిట్టింగ్’ ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా నిలిచింది..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..

హోలికా దహనంలో ఈ కలపను వాడుతున్నారా.. జాగ్రత్త

ట్విన్స్‌ డే రోజు అరుదైన ఘటన.. కవల సోదరీమణులను వివాహం చేసుకున్న కవల సోదరులు

పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త

ఇంట్లో తండ్రి మృతదేహం.. పరీక్ష హాల్లో తనయుడు పుట్టెడు దుఃఖంతో..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *