
ప్రభాస్ లైనప్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్పిరిట్. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ తర్వాత విరామం తీసుకున్న మేకర్స్, త్వరలో తదుపరి షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నారు. ఈ సమయంలో స్పిరిట్ కథాంశానికి సంబంధించిన వార్తలు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. ది రాజా సాబ్ సినిమాతో అభిమానులను నిరాశపరిచిన ప్రభాస్ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో స్పిరిట్ చిత్రాలు చేస్తున్నారు. ఫౌజీ ఒక రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథ అని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. స్పిరిట్ కంటెంట్ విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొదట యానిమల్ తరహాలో హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ప్రచారం జరిగినా, తాజా అప్‌డేట్స్ కథ విషయంలో కొత్త కోణాలను ఆవిష్కరించాయి.