కేవలం ఒకే ఒక్క సినిమాతో సినీరంగంలో సెన్సేషన్ అయ్యింది. మలయాళీ చిత్రపరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం సరైన ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం విశేషం. తెలుగులో ఈ బ్యూటీకి అనుకున్నంత క్రేజ్ వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఆపర్స్ మాత్రం రాలేదు. గోల్డెన్ బ్యూటీగా ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది.. అయినా టాలీవుడ్ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మకు ఓ పాడు అలవాటు ఉందట.. తనకు మద్యం సేవించే అలవాటు ఉందని చెప్పి షాక్ ఇచ్చింది. దాంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరు.? అనేది చూద్దాం.!
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తున్న భామ..! ఎవరో తెలుసా.?
మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్.. తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. పవన కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సరసన బింబిసారలోనూ నటించింది. సాయి ధరమ్ తేజ్ తో కలిసి విరూపాక్ష సినిమా తో హ్యాట్రిక్ హిట్స్ తో పాటు వంద కోట్ల మూవీని ఖాతాలో వేసుకుంది. ధనుష్‌తో చేసిన సార్ కూడా సూపర్ హిట్ కాగా, కల్యాణ్ రామ్ తో చేసిన డెవిల్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. మొత్తానికి తెలుగులో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి
లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్
ఆతర్వాత ఒక ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది ఈ అమ్మడు.. ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేసింది. ప్రస్తుతం పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. అలాగే స్వయంభు, అఖండ2 తో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే సంయుక్తకు మద్యం సేవించే అలవాటు ఉందట.. ఓ ఇంటర్వ్యూలో సంయుక్త మాట్లాడుతూ..తనకు ఆల్కహాల్ సేవించే అలవాటుందని, కానీ అదే పనిగా తాగనని, ఎప్పుడైనా స్ట్రెస్, టెన్షన్స్ ఎక్కువైనప్పుడు మాత్రమే కొంచెం తీసుకుంటానని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పింది. మాములుగా హీరోయిన్లకు ఇలాంటి అలవాట్లున్నా ఎవరూ బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ సంయుక్త మేనన్ మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసింది. దాంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మంచి కొడుకును కాలేకపోయా.. జీవితం అయిపోయిందని బాధపడ్డా.. ఎమోష్నలైన షణ్ముఖ్ జశ్వంత్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.