టాలీవుడ్‌లో కొత్త పాతల మేలు కలయిక అనే సిద్ధాంతం ఇప్పుడు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. పెద్ద హీరోలు పెద్ద దర్శకులతో, యువ హీరోలు యువ దర్శకులతోనే కాకుండా, క్రాస్ ఓవర్ కాంబినేషన్లలో సినిమాలు చేయడం ద్వారా కొత్తదనాన్ని కోరుకుంటున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రెండ్‌ను టాలీవుడ్‌లోని సీనియర్ హీరోలు ఇట్టే అర్థం చేసుకున్నారు. వారి ప్రస్తుత, రాబోయే ప్రాజెక్టులు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్టకు విశ్వంభర వంటి భారీ చిత్రాన్ని ఇచ్చారు. ఇది ఆయన ప్రయోగాత్మక దృక్పథాన్ని సూచిస్తుంది. నందమూరి బాలకృష్ణ కూడా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో సినిమా చేయబోతున్నారనే వార్త పరిశ్రమలో వైరల్‌గా మారింది. అక్కినేని నాగార్జున తన 100వ సినిమా కోసం రా కార్తీక్‌ను ఎంపిక చేసుకుని తన ప్రయోగాత్మక వైఖరిని కొనసాగిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :