సెప్టెంబర్ 21న పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇది భారతదేశంలో కనిపించదు. ఈ రోజు మహాలయ అమావాస్య కూడా ఉండటం విశేషం. సాంప్రదాయకంగా, అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు అర్పించడం జరుగుతుంది. సూర్యగ్రహణం, అమావాస్య ఒకే రోజు రావడం ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. గ్రహణానికి నాలుగు లేదా ఐదు గంటల ముందు భోజనం చేయడం మంచిది. గ్రహణం ప్రారంభానికి ముందు తులసి ఆకులను ఆహారం మరియు నీటిలో వేయడం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుందని నమ్మకం. సూర్యగ్రహణం సమయంలో శుభకార్యాలు, పూజలు, మతపరమైన కార్యక్రమాలు నివారించాలి. ఆ సమయంలో ఆహారం తీసుకోవడం, నీరు త్రాగడం, నిద్రించడం చేయకూడదు. ఈ సమయంలో మంత్ర పఠనం శుభప్రదమని నమ్ముతారు.
మరిన్ని వీడియోల కోసం :