సెకండ్ హ్యాండ్లో కారు కొనే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మీరు పశ్చాత్తాపపడల్సి ఉంటుంది. ఒక్కోసారి మీకు లక్షల్లో నష్టం వాటిల్లవచ్చు. అయితే కొన్ని టిప్స్ తెలుసుకొని ఆచరిస్తే ఎలాంటి సమస్య ఉండదని అంటున్నారు నిపుణులు.
మీ సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటే మాత్రం ముందు వాహనం సర్వీస్ హిస్టరీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, టైర్లు, ఇంజన్, ఫ్రేమింగ్, మైలేజ్, ఓడోమీటర్, టెస్ట్ డ్రైవ్, ఇంజిన్, ఇన్సూరెన్స్ పేపర్లు పక్కాగా ఉన్నాయా.? లేదా.? అనే విషయాన్ని తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
మీరు తీసుకోబోయే సెకండ్ హ్యాండ్ కారు పరిస్థితిని ముందుగానే తనిఖీ చేయాలి. లోపలి భాగాన్ని, బాడీతోపాటు ఫ్రేమింగ్ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఓడోమీటర్ చెక్ చెయ్యండి. అలాగే టెస్ట్ డ్రైవ్ చేస్తే దీని గురించి మీకు పూర్తీ అంచనా వస్తుంది. ఇంజిన్, అన్ని ఇతర ముఖ్యమైన పార్ట్స్ అన్ని చెక్ చేయండి.
చాలామంది సర్వీస్ చరిత్రను తనిఖీ చేయడం మర్చిపోతారు. కానీ ఇది చెక్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి. సెకండ్ హ్యాండ్లో కారు కొనడానికి వెళ్లినప్పుడు, ఖచ్చితంగా కారు సర్వీస్ చరిత్రను తనిఖీ చేయండి.
మీరు కొనాలనుకునే కారు ఇన్సూరెన్స్ పేపర్లను కూడా క్షుణ్ణంగా చెక్ చేయండి. టెస్ట్ డ్రైవ్‌కు వెళ్ళినప్పుడు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో కారును డ్రైవ్ చేయడం మంచింది. ఇవన్నీ మీరు పాటించడం వల్ల మంచి సెకండ్ హ్యాండ్ కారును తీసుకోవడంలో సహాయపడుతుంది.