జ్యోతిష్యం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఇవి మారినప్పుడు దీని ప్రభావం 12 రాశుల వారి మీద పడుతుంది. అయితే, త్వరలో సూర్య చంద్రులు కలవనున్నారు.
సూర్యుడు, చంద్రుల కలయిక జరిగినప్పుడు వ్యతిపత్ యోగం ఏర్పడుతుంది. ఇది ఈ నెల చివర్లో ఏర్పడనుంది. ఈ అరుదైన కలయిక వలన రెండు రాశుల వారి దశ తిరగబోతుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
సింహ రాశి : సూర్యచంద్రుల కలయిక ఈ రాశి వారికి మంచి రోజులురానున్నాయి. అలాగే, కొంత ప్రశాంతత దొరుకుతుంది. కొత్తగా ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో జరిగే గొడవలు కూడా ఆగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి.
కర్కాటక రాశి : సూర్యచంద్రుల కలయికతో ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఇంటి సభ్యులతో చర్చించి తీసుకోండి. జీవితం పాజిటివ్ గా మారిపోతోంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మలుపులు వస్తాయి. గొడవలు మొత్తం పూర్తిగా తగ్గిపోతాయి.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




