రాకెట్ సూర్యుడిని చీలుస్తూ దూసుకెళ్లినట్లుగా ఫొటో ఆవిష్కృతమైంది. ఇందులో ఉదయ భాస్కరుడి ఉపరితలంలోని క్రోమోస్పియర్ హైడ్రోజన్ అల్ఫా లైట్లో చక్కగా కనిపిస్తోంది. గతంలోనూ ఇలాంటి దృశ్యాలు కెమెరా కంటికి చిక్కినప్పటికీ అవి సాధారణ తెల్లటి కాంతిలోనే కనిపించాయి తప్ప.. ఇంత కనువిందైన సోలార్ క్రోమోస్పియర్ దృశ్యాన్ని మాత్రం నేటికీ ఎవరూ బంధించలేకపోయారు. ఆ పని మెక్‌కార్తీ విజయవంతంగా పూర్తిచేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సోలార్ టెలిస్కోప్‌తోపాటు అ్రస్టానమీ కెమెరాను ఉపయోగించారు. రాకెట్ లాంచ్‌ప్యాడ్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో తన కెమెరాను బిగించి, ఈ ఫొటో తీశారు. రాకెట్ నుంచి చిమ్ముతున్న నిప్పుల వర్షం సూర్యుడి వర్ణంతో సరిగ్గా కలిసిపోయింది. సూర్యుడిని రెండు ముక్కలుగా కత్తిరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. సూర్యుడి క్రోమోస్పియర్తోపాటు రాకెట్ ఒకే చోట దర్శనమిస్తున్న తొలి ఫొటో ఇదేనని చెప్పొచ్చు. అస్ట్రోఫొటోగ్రఫీ, స్పేస్ అబ్జర్వేషన్లో ఇది కీలక ఘట్టం. ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చిత్రీకరించే అవకాశం జీవిత కాలంలో ఒక్కసారే లభిస్తుందని మెక్‌కార్తీ ఆనందం వ్యక్తంచేశారు. ఇది సైన్స్, ఆర్ట్ సమ్మేళనమని అభివర్ణించారు. అంతరిక్షంలోని అందాలను ఒడిసిపట్టడంలో ఎన్నో రికార్డులను మెక్ కార్తీ సొంతం చేసుకున్నారు. సాధారణ టెలిస్కోప్‌తో చూడలేని ఎన్నో దృశ్యాలను తన ప్రతిభతో ప్రపంచానికి చూపించారు. స్టార్‌లింక్ మిషన్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధకులు ఫాల్కన్–9 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ ప్రయోగం ద్వారా 28 ఉపగ్రహాలను భూదిగువ కక్ష్యలో పరిశోధకులు ప్రవేశపెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముంబై కోస్టల్ రోడ్ లో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన లాంబోర్గిని కారు
AP Assembly: సూపర్ GSTతో సూపర్ సేవింగ్స్ ప్రజలకు చేరాలి
దేవుడిని కూడా వదలని ఆ దొంగలు తప్పించుకోలేరు
హైదరాబాద్ లో నదులను తలపిస్తున్న పలు ప్రాంతాలు
పప్పు గుత్తిగా జేసీబీ.. వామ్మో.. ఇలా కూడా వండుతారా