సీనియర్ ఎన్టీఆర్‌కే షాకిచ్చిన ఆ కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి.. దెబ్బకు టాలీవుడ్ షేక్.!

సీనియర్ ఎన్టీఆర్‌కే షాకిచ్చిన ఆ కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి.. దెబ్బకు టాలీవుడ్ షేక్.!


సీనియర్ ఎన్టీఆర్‌కే షాకిచ్చిన ఆ కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి.. దెబ్బకు టాలీవుడ్ షేక్.!

నటుడు మురళి మోహన్ చిరంజీవి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలకు చాలా ఏళ్ల ముందే అదే కథాంశంతో బొమ్మరిల్లు అనే చిత్రం వచ్చిందని, అందులో తానే హీరోగా ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడిగా నటించానని మురళి మోహన్ గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ బాపినీడు నిర్మించారు. కమర్షియల్ అంశాలు లేకుండా పూర్తిగా కుటుంబ కథా చిత్రంగా రూపొందిన బొమ్మరిల్లు అప్పట్లో తిరుగులేని విజయం సాధించిందని, ఎన్టీఆర్ యమగోల చిత్రానికి పోటీగా విడుదలై దానితో సమానంగా ఆడిందని ఆయన వివరించారు.

అదే కథను కమర్షియల్ అంశాలు జోడించి పెద్ద హీరోతో తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని విజయ్ బాపినీడు బలంగా నమ్మేవారని మురళి మోహన్ పేర్కొన్నారు. తనతో ఈ ఆలోచన పంచుకున్నప్పుడు “ఆ కథను ఇప్పుడు ఎవరు చూస్తారు?” అని తాను అడిగానని, అయితే బాపినీడు “చిరంజీవితో చేస్తాను, ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడు” అని అన్నారని మురళి మోహన్ వెల్లడించారు. బొమ్మరిల్లులో చిన్న తమ్ముడిగా నటించిన తాను గ్యాంగ్ లీడర్లో పెద్ద అన్నయ్యగా నటించడం విశేషం. తన సినీ ప్రస్థానంలో అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో ఎన్టీఆర్ తమ్ముడిగా నటించగా, గ్యాంగ్ లీడర్ తర్వాత అభిమానులంతా చిరంజీవి అన్నయ్య అని పిలిచేవారని మురళి మోహన్ గుర్తు చేసుకున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ యమగోలకు గట్టి పోటీనిచ్చిన బొమ్మరిల్లు కథాంశం చిరంజీవికి గ్యాంగ్ లీడర్ రూపంలో ఇండస్ట్రీ హిట్ అందించింది. చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో మన ఊరి పాండవులు చిత్రంలో మురళి మోహన్‌తో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

ఇది చదవండి: కూలీ పనులకు వెళ్లే రైతులకు దూరంలో మసకగా కనిపించింది.. దగ్గరకెళ్లి పరిశీలించగా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *