13 నిమిషాల డాక్యు డ్రామాలో బాలీవుడ్లో లైటింగ్ టెక్నీషియన్స్‌గా పనిచేస్తున్న మహిళల కష్టాలు, సవాళ్లు, పట్టుదలని చూపించింది. సాధారణంగా ఆ పనిని మగవారే ఎక్కువగా చేస్తారు. హేటల్ డెద్దియా, ప్రియాంకా సింగ్, లీనా గంగుర్డే అనే ముగ్గురు మహిళాగ్రాఫర్లు ఒత్తిడుల మధ్య తమ కెరీర్‌ను ఎలా మలచుకున్నారన్నదే స్టోరీ. ప్రస్తుతం ఆ డాక్యుమెంటరీ లాస్ ఏంజిల్స్‌లోని రెజెన్సీ థియేటర్లో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ప్రదర్శిస్తున్నారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌తో 2026 ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ కేటగిరీకి అర్హత సాధించే అవకాశం ఉంది. తమ కూతురు దియా తీసిన ‘లీడింగ్ లైట్’ సినిమాకు తాము సపోర్ట్ చేస్తున్నందుకు గర్వపడుతున్నామని సూర్య-జ్యోతిక అన్నారు. బాలీవుడ్ మహిళా టెక్నీషియన్ల జీవన ప్రయాణం మీద తీసిన చిత్రాన్ని అందరికీ చేరువ చేయడం సంతోషంగా ఉందన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐటీ ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..
పురానాపూల్‌లో నీటమునిగిన శివాలయం.. వరదలో చిక్కుకున్న పూజారి కుటుంబం
సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమాల క్యూ
కమ్ బ్యాక్ కోసం చూస్తున్న డైరెక్టర్స్
Pawan Kalyan’s OG Movie: పవన్ కళ్యాణ్ కెరీర్లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్