పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు విపరీతమైన క్రేజ్ వస్తుంది. భారీ అంచనాల మధ్య ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తుంది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ చాలా పవర్ ఫుల్ అండ్ స్టయిలిష్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓజీ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 24 నైట్ నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ సినిమాకు బుకింగ్స్ కూడా భారీగా జరిగాయి.
ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా సీన్స్ మొత్తం కట్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మమతా మోహన్ దాస్
ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రెటీలు కూడా సినిమా పై రివ్యూ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఓజీ సినిమా పై రివ్యూ ఇచ్చారు. “పవన్ కల్యాణ్‌ను అందరూ ‘ఓజాస్ గంభీర’గా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమన్ సంగీతం అద్భుతంగా ఉంది అని చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేస్తున్నారు. సినిమాలో పవన్ ఎలివేషన్స్ కు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. కొంతమంది అత్యుత్సహంతో చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. దాంతో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఓ కండిషన్ పెట్టింది. ఈమేరకు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి
బెస్ట్ ఫ్రెండ్ భర్తనే వలలో వేసుకున్న స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే అతనితో..
“పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంతో ఉత్సాహం అతి స్థాయికి చేరింది. ప్రేక్షకులు ఉత్కంఠ, ఉత్సాహంలో కేకలు వేస్తూ, దూకుతూ, టీ-షర్ట్లు కూడా చింపేసుకుంటున్నారని గమనించబడింది. దయచేసి సినిమా చూడటానికి వచ్చేటప్పుడు ఒక అదనపు టీ-షర్ట్ వెంట తెచ్చుకోవాలని మనవి” అంటూ ప్రకటన విడుదల చేశారు.
చేసింది రెండు సినిమాలు.. రెండూ యావరేజ్..! అయినా తగ్గని క్రేజ్.. చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే
సుజిత్ ఇన్ స్టా గ్రామ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.