సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని కంబాలపల్లి గ్రామ రైతులు తమ వ్యవసాయ భూములను చేరుకోవడానికి వర్షాకాలంలో ప్రాణాలను పణంగా పెడుతున్నారు. పొలాలకు అడ్డంగా ఉన్న నంది వాగుపై వంతెన లేకపోవడంతో, అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు నేరుగా, ఉద్ధృతంగా ఉన్నప్పుడు తెప్పలు లేదా థర్మోకోల్ షీట్లపై వాగు దాటుతున్నారు. ఈ సాహసోపేత ప్రయాణాల కారణంగా మహిళా కూలీలు భయపడి పనులకు వెళ్ళలేకపోతున్నారు, ఇది వారి జీవనోపాధిని దెబ్బతీస్తోంది. కంబాలపల్లికి చెందిన సుమారు 140 నుండి 150 ఎకరాలు, పక్కన ఉన్న అనుసాత్ గ్రామానికి చెందిన 100 ఎకరాల భూమి వాగు అవతల ఉన్నాయి. దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ప్రభుత్వాలు వస్తున్నా, పోతున్నా తమ కష్టాలు తీరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెన నిర్మించి తమ కష్టాలను తీర్చాలని కంబాలపల్లి రైతులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంత్రి లోకేష్ కు క్రికెటర్ తిలక్ వర్మ గిఫ్ట్
వాట్సాప్‌కు “అరట్టై’ పోటీ కానుందా.. ట్రెండింగ్ లోకి వచ్చిన యాప్
బాలీవుడ్ లో శ్రీలీల, సాయి పల్లవి తొలి అడుగులు
ఇండియాలోనూ రప్ఫాడిస్తున్న జేమ్స్ కామెరూన్
పక్కా ప్లానింగ్‌తో నేచురల్ స్టార్ నాని.. బొమ్మ దద్దరిల్లి పోతుంది అంతే