నడక ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఆరోగ్యకరమైన జీవితం కోసం తప్పకుండా నడవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా తీసుకుంటున్న ఆహారం జీవైనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. అంతే కాకుండా ఊబకాయం, డయాబెటీస్ వంటి వ్యాధుల బారినపడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలు ఏవి ధరి చేరకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా నడవాలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా రీసెంట్గా చేసిన ఓ సర్వేలో నడక గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెళ్లడయ్యాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
ప్రతి వ్యక్తికి శారీరక శ్రమ అనేది చాలా అవసరం. కానీ ఈరోజుల్లో శారీక శ్రమ అనేది తగ్గిపోతుంది. దీంతో అనేక వ్యాధుల బారినపడి ఆసుపత్రిల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా అధిక బరువుతో జిమ్ సెంటర్లలోనే ఎక్కువగా గడుపుతున్నారు. అయితే ఎలాంటి సమస్యలకైనా సరే నడకే మంచి ఔషధం అంటున్నారు ఆరోగ్యనిపుణులు. నడవడం వలన ఎంత పెద్ద సమస్య అయినా త్వరగా తగ్గిపోతుంది. అందుకే తప్పకుండా ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలపాటు నడవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు.
కానీ కొంత మంది మాత్రం నడవడానికి అస్సలే ఇంట్రెస్ట్ చూపెట్టరు. కానీ తాజా ఆధ్యయనంలో నడక గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెళ్లడి అయ్యాయి. ప్రతి రోజూ నడవడం వలన అసలు ప్రాణ భయమే ఉండదంట. అది ఎలా? ఎందుకు అని ఆలోచిస్తున్నారా? డైలీ వాకింగ్ చేయడం వలన ఉత్సాహం పెరగడమే కాకుండా చాలా ఆనందంగా కూడా ఉంటారు. ఏకాగ్రత పెరుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందంట.దీని వల వ్యక్తి ఆయుష్షు పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
ముఖ్యంగా రీసెంట్గా లాన్సెట్ చేసిన అధ్యయనంలో నడకతో ఒక వ్యక్తి ఆయుష్షు పెరుగుతుందని వెళ్లడైంది. రోజుకు 7000 అడుగులు నడవడం వల్ల ఆయుష్షుపెరుగుతుందంట. ప్రపంచ వ్యాప్తంగా 1.6 లక్షల మంది నిర్వహించిన ఈ సర్వేలో 57 అధ్యయానాల్లో ఈ విషయం వెళ్లడైంది. రోజుకు రెండు వేల అడుగులు నడిచే వ్యక్తులతో పోలిస్తే రోజుకు ఏడు వేల అడుగులు నడిచే వారికి మరణ ముప్పు 47 శాతం తక్కువగా ఉంటుందంట.
అదే విధంగా రోజుకు కనీసం ఏడు వేల అడుగులు నడిచే వారి ఆరోగ్యంకూడా చాలా బాగుంటుందంట. వీరికి గుండె జబ్బుల రిస్క్ 25 శాతం తక్కువగా, అలాగే టైప్ 2 డయాబెటిస్ రిస్క్ 14 శాతం తక్కువగా క్యాన్సర్ రిస్క్ 6%, డిప్రెషన్ రిస్క్ 22% తక్కువ ఉండే ఛాన్స్ ఉన్నదం. అందుకే ప్రతి వ్యక్తి తప్పకుండా ఏడు నుంచి ఏనమిది వేల అడుగులు నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.