తెలంగాణలోని సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. ఈ నెల 30లోపు ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తుండగా, సుప్రీం కోర్టు రిజర్వేషన్లపై ఇచ్చే తీర్పును బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ నాయకత్వం బీసీ రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కోరుతోంది. అంతేకాకుండా, త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :