పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH) లో పనిచేస్తున్న ఒక వైద్యుడు పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఆ క్లిప్‌లో ఆసుపత్రి లోపల కిటికీ పైన ఉన్న పైకప్పు నుండి ప్లాస్టర్ పడిపోవటం స్పష్టంగా కనిపిస్తుంది. ఆపరేషన్ సమయంలో ఆపరేటింగ్ థియేటర్ పైకప్పు కూలిపోయినట్టుగా సదరు డాక్టర్ పేర్కొన్నాడు. ఈ సంఘటనలో అతను కూడా గాయపడినట్టుగా చెప్పారు. పరిస్థితిని వివరిస్తూ సంఘటనకు బాధ్యులకు విజ్ఞప్తి చేస్తూ అతను వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. ఇటువంటి వాతావరణంలో ప్రాణాలను పణంగా పెట్టి ఎలా పని చేయగలం అంటూ సంబంధిత అధికారులను ప్రశ్నించారు.
అప్‌లోడ్ చేసిన వైద్యుడు డాక్టర్ ఆర్థో తన పోస్ట్‌లో ఆపరేషన్ థియేటర్ లోపల సర్జరీ సమయంలో ప్లాస్టర్ పడిపోయిందని పేర్కొన్నాడు. దాంతో అతని కాలికి గాయమైంది. సమీపంలో నిలబడి ఉన్న ఒక నర్సు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. ఈ వీడియోను X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ, @Dr_KD_MS ఇలా రాశారు. “ఈరోజు, PMCHలో శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు, నా వెనుకే ఆపరేటింగ్ థియేటర్ పైకప్పు కూలిపోయింది. నా కాలికి గాయమైంది. సమీపంలో నిలబడి ఉన్న ఒక నర్సు తృటిలో తప్పించుకుంది. అలాంటి వాతావరణంలో ఎవరైనా ఎలా పని చేయగలరు? ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆసుపత్రిని ఇలా ఎలా నిర్మించగలరు? అంటూ ప్రశ్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి 100,000 కంటే ఎక్కువ వ్యూస్, 3,500 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
हमारा जर्जर #healthcare सिस्टम!👎
ये PMCH पटना बिहार का ऑपरेशन थिएटर (OT) है।
Operation के दौरान ही छत टूट के नीचे गिरने लग गई, डॉक्टर को भी चोट लगी है।🚨सरकार का फोकस Quantity की Quality और व्यवस्थाओं पर होना चाहिए।🙏
pic.twitter.com/AQzWCMQ6YC— Dr. B L Bairwa MS, FACS (@Lap_surgeon) September 26, 2025
ఆసుపత్రి లోపల జరిగిన ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒకవేళ ఎదైనా పెద్ద ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అంటూ చాలా మంది నెటిజన్లు ప్రశ్నించారు. బీహార్‌లోని అన్ని పాత ప్రభుత్వ భవనాల పరిస్థితి ఇలాగే ఉంది. ఎవరూ వాటిపై దృష్టి పెట్టగం లేదు, ఫలితంగా, అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అంటూ చాలా మంది స్థానికులు మండిపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..