
అండమాన్, నికోబార్ దీవులలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం అండమాన్, నికోబార్ దీవులలోని మాయాబందర్ సమీపంలో పవన్ హన్స్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేలోపే కూలిపోయింది. అందులో ఉన్న ఇద్దరు సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు తృటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డారు. హెలికాప్టర్ ప్రయాణికులతో పోర్ట్ బ్లెయిర్ నుండి బయలుదేరినట్లు సమాచారం. హెలికాప్టర్‌లో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సముద్రం మధ్యలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్‌లో ఉన్న వారందరినీ సురక్షితంగా రక్షించారు. ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదని పవన్ హన్స్ ప్రతినిధి ధృవీకరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..