శ్రీశైల మల్లన్నకు విరాళంగా బంగారు రుద్రాక్ష మాల, హారం

శ్రీశైల మల్లన్నకు విరాళంగా బంగారు రుద్రాక్ష మాల, హారం


నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు భక్తుల నుండి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. స్వామి అమ్మవార్ల పట్ల తమకున్న భక్తిని చాటుకుంటూ భక్తులు భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలను సమర్పిస్తున్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబ సభ్యులు స్వామివారికి విశిష్టమైన స్వర్ణాభరణాలను కానుకగా అందజేశారు. బాపట్లకు చెందిన దాతలు, ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబ సభ్యులు మల్లన్న సేవలో భాగంగా రెండు ముఖ్యమైన ఆభరణాలను తయారు చేయించారు. వాటిలో సుమారు 43 గ్రాముల బంగారంతో రుద్రాక్ష మాల, సుమారు 30 గ్రాముల మేలిమి బంగారంతో బంగారు హారాన్ని తయారుచేయించారు. రుద్రాక్షమాలలో విశిష్టమైన త్రిశూలం, ఢమరుకాన్ని కూడా పొందుపరిచారు. ఇక బంగారు హారాన్ని చక్కని నగిషీలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ ఆభరణాలను దేవస్థానం అధికారులకు శాస్త్రోక్తంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దాతలకు వేదాశీర్వచనం పలికి, శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీశైల క్షేత్ర వైభవాన్ని చాటిచెప్పేలా భక్తులు ఇలాంటి భారీ విరాళాలు సమర్పించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..

బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!

పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!

Thanuja Puttaswamy: ఫ్యాన్ పై విరుచుకుపడ్డ తనూజ.. సిగ్గు లేదా అంటూ..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *