
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 28న (ఆదివారం) ప్రత్యేకంగా రూపొందించబడిన సంఘ్ గీతాల ఆవిష్కరణ జరగనుంది.. తరతరాలకు స్ఫూర్తినిచ్చిన ఈ ఐకానిక్ దేశభక్తి గీతాలలో కొన్నింటిని ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ స్వరపరిచారు.. ఈ కార్యక్రమంలో వాటిని ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నారు. ఈ సంకలనాన్ని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అధికారికంగా విడుదల చేస్తారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. 1925లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ పాటలను ఆర్‌ఎస్‌ఎస్ శాఖలు.. శిబిరాల్లో ఆలపిస్తున్నారు. ఖస్దార్ సాంస్కృతిక మహోత్సవ్ సమితి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సంగీతం, సంస్కృతి, దేశభక్తిని మిళితం చేసేలా ఉంటుందని.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పేర్కొంది.
కొత్తగా కూర్చబడిన సంఘ్ గీత్ సేకరణ సమకాలీన సంగీతంతోపాటు.. సాంప్రదాయ స్ఫూర్తిని మిళితం చేస్తుంది.. ఇవి దీర్ఘకాల మద్దతుదారులకు, యువ ప్రేక్షకులకు ఆకర్షణీయంగా నిలవనున్నాయి.. శంకర్ మహదేవన్ ప్రదర్శన స్వయం సేవక్, భక్తి – దేశభక్తి సారాన్ని కాపాడుతూ ఆధునిక శక్తిని నింపుతుందని భావిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ ఆవిష్కరణ జరగనుండటం విశేషం..
దశాబ్దాలుగా, ‘సంఘ్ గీత్స్’ జాతీయ గర్వానికి మూలంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రేరణగా కూడా నిలుస్తున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేతలు తెలిపారు. రేషింబాగ్‌లోని కవివర్య సురేష్ భట్ ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు ఈ పాటల సంకలనాన్ని RSS సర్సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ప్రారంభిస్తారని ఆర్ఎస్ఎస్ తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..