వేసవిలో రోజూ ఈ జ్యూస్‌ తాగారంటే.. మీ ఒంట్లో జరిగేది మహా అద్భుతమే..!

వేసవిలో రోజూ ఈ జ్యూస్‌ తాగారంటే.. మీ ఒంట్లో జరిగేది మహా అద్భుతమే..!


బత్తాయి పండ్లు అంటే మీకు ఇష్టమా? తప్పకుండా ఇవి తెలుసుకోవాల్సిందే. నిజానికి బత్తాయి పండ్లతో తయారుచేసిన రసాన్ని తాగడం శరీరానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రసంలో ఉండే అద్భుతమైన గుణాలు డిహైడ్రేషన్ సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఈ రసంలో విటమిన్ సితో పాటు ఎన్నో రకాల విటమిన్లు లభిస్తాయి. ఇది జీర్ణ క్రియను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. స్వీట్ లైమ్‌లో సహజ చక్కెరలు, గ్లూకోజ్, ఫ్రుక్టోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. ఎండలో బయట తిరిగి వచ్చినప్పుడు ఒక గ్లాస్ మోసంబి రసం తాగితే అలసట తగ్గి ఉత్సాహం వస్తుంది. విపరీతమైన ఎండల కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది.

మోసంబి రసం తాగడం వల్ల ఎలక్ట్రోలైట్స్ సమతుల్యం మెరుగుపడుతుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకంతో పాటు అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు రోజు ఉదయాన్నే బత్తాయి పండ్ల రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఈ రసాన్ని తాగడం వల్ల అలసట వంటి సమస్యలు కూడా పూర్తిగా దూరమవుతాయి. అలాగే ఇందులో ఉండే అద్భుతమైన గుణాలు చర్మాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.

స్వీట్ లైమ్‌లో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో వచ్చే జలుబు, ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారం తిన్న తర్వాత ఒక గ్లాస్ రసం తీసుకుంటే అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపు శుభ్రంగా ఉండేందుకు ఇది సహజ మార్గం. వేసవిలో చర్మం మసకబారడం, ట్యానింగ్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి కాంతిని పెంచుతాయి. క్రమం తప్పకుండా మోసంబి రసం తాగడం వల్ల చర్మానికి సహజ కాంతి వస్తుంది.

ఇవి కూడా చదవండి

స్వీట్ లైమ్ జ్యూస్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. చక్కెర లేకుండా తీసుకుంటే బరువు నియంత్రణలో కూడా ఇది సహాయపడుతుంది. డైట్‌లో ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్. సమ్మర్‌లో కూల్ డ్రింక్స్‌కు బదులుగా సహజమైన స్వీట్ లైమ్ జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి తేమను అందించడంతో పాటు, శక్తి, రోగనిరోధక శక్తి, చర్మ కాంతివంతంగా ఉంచడంలో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే చక్కెర ఎక్కువగా కలపకుండా, తాజాగా తయారుచేసిన జ్యూస్ తాగడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *