వెంకటేష్ నో చెప్పాడు.. బాలయ్య చేసేశాడు..! కట్ చేస్తే ఇండస్ట్రీని హిట్..!! ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించిన మూవీ

వెంకటేష్ నో చెప్పాడు.. బాలయ్య చేసేశాడు..! కట్ చేస్తే ఇండస్ట్రీని హిట్..!! ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించిన మూవీ


సీనియర్ హీరోలు కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వెంకటేష్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసింది. అలాగే ఈ ఏడాది చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించారు. ఈ సినిమా కూడా భారీ హిట్ అయ్యింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు అనిల్ రావిపూడితో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. అయితే వెంకటేష్ ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు నో చెప్పాడట.. అదే సినిమా బాలకృష్ణ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది.

వెంకటేష్ నో చెప్పిన కథతో బాలకృష్ణ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. నందమూరి అభిమానులకు ఆ సినిమా పూనకాలు తెప్పించింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమా మరేదో కాదు సమరసింహారెడ్డి. బీగోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1999 సంక్రాంతి కానుకగా విడుదలైన సమరసింహారెడ్డి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఫ్యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ కు పూనకాలు తెప్పించింది. అంజలా జవేరి, సంఘవి, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే దర్శకుడు బి. గోపాల్ మొదట ఈ సినిమా కథను వెంకటేష్ కు వినిపించారట. అయితే అప్పటికి వెంకటేష్ ఫ్యామిలీ కంటెంట్ సినిమాలు, లవ్ స్టోరీస్‌తో చేస్తుండటంతో ఫ్యాక్షన్ కథలకు అప్పుడే సిద్ధంగా లేను అని చెప్పారట. అయితే ఫ్యాక్షన్ కథలు, మాస్ యాక్షన్ సిన్ సినిమాలకు బాలకృష్ణ న్యాయం చేస్తారు అని చెప్పి వెంకటేష్ బాలయ్య పేరును సూచించారట. దాంతో బి గోపాల్ బాలకృష్ణకు కథను వినిపించగానే బాలయ్య ఒకే చెప్పారట. అలా వెంకీ నో చెప్పిన కథను బాలయ్య చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *