ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఐరన్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అందువలన ప్రతి ఒక్కరూ రోజూ ముల్లంగి తినడం వలన ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి , మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.
అయితే చాలా వరకు ముల్లంగిని ఫైల్స్ సమస్య ఉన్నవారు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఇక దీనిని కొందరు కర్రీ చేసుకొని తింటే మరికొంత మంది సలాడ్ రూపంలో, ఇంకొందరు పచ్చిగా తీసుకుంటారు. అయితే దీనిని ఇలా మాత్రమే కాకుండా కొన్ని రకాల పదార్థాలతో ముల్లంగిని తీసుకోవడం చాలా హానికరం అంటున్నారు నిపుణులు.
చాలా మంది ఆరోగ్యం కోసం ఉదయాన్నే పాలు తాగుతుంటారు. అయితే ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరిచే పాలను మల్లంగిని కలిపి అస్సలే తీసుకోకూడదంట. దీని వలన అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరీ ముఖ్యంగా పాలు తాగిన వెంటనే ముల్లంగి తింటే అది చాలా హానికరం అంట. అందుకే ముల్లంగి తిన్న తర్వాత దాదాపు రెండు గంటల తర్వాతే పాలు తాగాలంట.
కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా డయాబెటీస్ పెషెంట్స్కు ఇది వరం అనే చెప్పాలి. వారంలో కనీసం రెండు సార్లైనా కాకరకాయ తినడం వలన అనేక ప్రయోజనాలు ణ్నాయని చెబుతుంటారు. అయితే కాకరకాయ, ముల్లంగి అస్సలే కలిపి తీసుకోకూడదంట. వీటిని కలిపి తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, ఇది చాలా విషపూరితం అంటున్నారు నిపుణులు.
అదే విధంగా తేనె , ముల్లంగి కూడా కలిపి తీసుకోకూడదంట. ఈరెండింటిని కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, కొన్ని సార్లు ప్రాణనష్టం కూడా జరిగే ఛాన్స్ ఉంటదంట. అందుకే వీలైనంత వరకు ఈ రెండింటికి దూరం ఉండాలని చెబుతున్నారు నిపుణులు.