విశాఖ షిప్‌యార్డ్‌లో.. హడలెత్తిస్తున్న విషసర్పాలు

విశాఖ షిప్‌యార్డ్‌లో.. హడలెత్తిస్తున్న విషసర్పాలు


విశాఖకు ఓ నౌక వచ్చి ఆగింది.. మరమ్మతుల కోసం లంగరు వేసుకుంది. అందులో పనిచేసేందుకు వర్కర్లు వెళ్లారు. ఒక్కసారిగా వాళ్లందరికీ ఒళ్ళు జలదరించే సీన్…! ఓ పాము కనిపించి క్షణాల్లో మాయమైంది. దీంతో అక్కడ ఉన్నవారు హడలెత్తిపోయారు. బయటకు పరుగులు తీసి నౌకలోని తలుపులు మూసేశారు. ఎవరూ మళ్లీ లోపలికి వెళ్లే సాహసం చేయలేదు. సముద్ర పరిశోధనల్లో ఎంతో పేరున్న ‘సాగర కన్య’ నౌక ఇప్పుడు పాముల భయంతో వార్తల్లో నిలిచింది. అండమాన్ సమీపంలో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన సమయంలో ఈ నౌకలోకి పాములు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ షిప్‌యార్డ్‌కు చేరుకున్న ఈ నౌకలో పనులు చేసేందుకు వెళ్లిన కార్మికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నెల రోజుల క్రితం మరమ్మతులు మొదలుపెట్టగా, ఒక పాము కనిపించడంతో కార్మికులు భయంతో పనులు ఆపేశారు. ఇటీవల మళ్లీ పనులు ప్రారంభించగా.. ఏకంగా ఒక భారీ కొండచిలువ, ఆ తర్వాత బుసలు కొడుతున్న నాగుపాము దర్శనమిచ్చాయి. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు రంగంలోకి దిగి, అత్యంత చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నారు. అయితే, ఇంజన్ గదిలో మరిన్ని పాములు ఉండే అవకాశం ఉందని ఆయన హెచ్చరించడంతో ఆందోళన నెలకొంది. భారతీయ సముద్ర శాస్త్ర అధ్యయనాల్లో ‘సాగర కన్య’ అత్యంత కీలకమైనది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో వాతావరణ మరియు భౌగోళిక పరిశోధనలు చేసే ఈ నౌకలో, ఇప్పుడు పాముల బెడద కారణంగా పనులు నెమ్మదించాయి. పదే పదే పాములు బయటపడుతుండటంతో, షిప్‌యార్డ్ సిబ్బంది లోపలికి వెళ్లేందుకు సాహసించడం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..

Lunar Eclipse 2026: చంద్రగ్రహణం నాడు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే

Driving Licence: ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం

దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *