విశాఖపట్నం నగరంలో కల్తీ నెయ్యి తయారీ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. తాజాగా, టాస్క్ ఫోర్స్ పోలీసులు,ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఒక సోదాలో, భారీ ఎత్తున కల్తీ నెయ్యి తయారీని ఛేదించారు. దాదాపు 120 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ నెయ్యి తయారీలో పాల్గొన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారు బళ్ళారి జిల్లాకు చెందినవారు అని తెలుస్తోంది. ఈ నిందితులు పామాయిల్, డాల్డా, ఒక రకమైన క్రీం పదార్థం, కృత్రిమ రంగులు, సుగంధ ద్రవ్యాలను కలిపి ఈ కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారు ఈ ముడి సరుకులను బెంగళూరు నుంచి తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. విశాఖపట్నం సమీపంలోని ఒక గ్రామంలో దాచిపెట్టి, పండుగల సమయంలో విజయవాడకు కూడా తరలివెళ్ళి అమ్ముతూ వుండేవారని తెలిసింది.
మరిన్ని వీడియోల కోసం :