
శుక్రవారం నాడు మహాలక్ష్మీ దేవిని పూజిస్తే మంచిది. శుక్ర గ్రహానికి ఆరాధన చేసే రోజు కూడా శుక్రవారం. ఆ రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే వివాహం తొందరగా అవుతుంది. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. దీంతో పాటు దీప, నైవేద్యాలను సమర్పించాలి. లక్ష్మీదేవికి తెల్లటి పూలను కచ్చితంగా సమర్పించాలి. శుక్రవారం నాడు తెలుపు లేదా లేత రంగు వస్త్రాలను ధరించి పూజించండి. ఇది శుక్ర బలాన్ని పెంచుతుంది.
శుక్రవారం చిన్న పిల్లలకు మజ్జిగ, పాలు, పెరుగు లాంటివి దానం చేయండి. వస్త్రాలు, ఆభరణాలు కూడా ఇవ్వొచ్చు. దీని ద్వారా వివాహ సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం పూట తులసి మొక్క దగ్గర దీపారాధన చేయండి. ఆ తర్వాత విష్ణుమూర్తిని ఆరాధించండి. దీంతో మంచి జీవిత భాగస్వామి లభిస్తారు. పూజఏదైనా కార్యాన్ని మొదలు పెట్టాలనుకుంటే మొట్టమొదట వినాయకుడిని పూజిస్తాము. శుక్రవారం గణపతిని పూజించడం వల్ల వివాహం తొందరగా అవుతుంది.
శుక్రవారం శుక్ర గ్రహానికి సంబంధించిన మంత్రాలను జపిస్తే మంచిది. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. శుక్రవారం పూట కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే త్వరగా వివాహం అవుతుంది. దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. విశ్వాసం,సహనంఈ పరిహారాలను పాటిస్తూనే నమ్మకంతో పాటు ఓపికతో ఉంటే మంచిది. అలాగే ఈ పరిహారాలు తొందరపడకుండా ఆచరించండి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న ఫెంగ్ షుయ్ సలహాలు, సంప్రదాయ నమ్మకాల ఆధారంగా చెప్పబడ్డాయి. ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం కాదు. వీటిని విశ్వసించడం లేదా పాటించడం పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..