విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. టికెట్ బుక్ చేసిన తర్వాత ప్లాన్ మారినా లేదా పొరపాట్లు జరిగినా భారీగా జరిమానాలు వసూలు చేసే విమానయాన సంస్థలకు డీజీసీఏ చెక్ పెట్టింది. 48 గంటలకు ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా, పేరు మార్చుకున్నా ఎలాంటి ఛార్జీలు కట్టాల్సిన పని లేదు. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు తమ విమాన టికెట్‌ను బుక్ చేసుకున్న 48 గంటల లోపు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే రద్దు చేసుకోవచ్చు. లేదంటే ప్రయాణ తేదీలను మార్చుకోవచ్చు. అయితే ఇది కొన్ని నిర్దిష్ట షరతులకు లోబడి ఉంటుంది. సాధారణంగా టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎయిర్‌లైన్స్ సగం ధరకు పైగా మొత్తాన్ని జరిమానాగా కోత విధిస్తాయి. కానీ తాజా సవరణతో ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా నేరుగా టికెట్ బుక్ చేసుకున్నప్పుడు.. పేరులో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని 24 గంటల్లోపు గుర్తిస్తే ఉచితంగా సరిచేసుకోవచ్చు. దీని కోసం సంస్థలు ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకూడదు. అలాగే చాలామంది ప్రయాణికులు ఎదుర్కొనే ప్రధాన సమస్య రీఫండ్ జాప్యం. దీనిపై డీజీసీఏ స్పందిస్తూ.. టికెట్‌ను ట్రావెల్ ఏజెంట్ లేదా పోర్టల్ ద్వారా బుక్ చేసినప్పటికీ రిఫండ్ ఇచ్చే బాధ్యత విమానయాన సంస్థలదే అని స్పష్టం చేసింది. రీఫండ్ ప్రక్రియను 14 పని దినాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రయాణికుడు లేదా వారి కుటుంబ సభ్యులకు మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడి టికెట్ రద్దు చేసుకుంటే.. రూల్స్‌ను సరళతరం చేశారు. గత ఏడాది ఇండిగో విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల వల్ల వేలాది మంది ప్రయాణికులు రీఫండ్ కోసం ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో కేంద్ర విమానయాన శాఖ జోక్యం చేసుకుని గడువులోగా రిఫండ్ ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి నుంచి పెరుగుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని డీజీసీఏ ఈ శాశ్వత మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!
Thanuja Puttaswamy: ఫ్యాన్ పై విరుచుకుపడ్డ తనూజ.. సిగ్గు లేదా అంటూ..
Rashmika-Vijay Marriage: మొత్తం 3 కిలోల బంగారు ఆభరణాలు.. ‘విరోష్’ ఆభరణాల ప్రత్యేకత ఏంటంటే ??
కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్..