ఇటీవల దేశంలోని విమానాశ్రయాలలో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ విమానాశ్రయంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. అరుణ్ మోదీ అనే వ్యక్తి బెంగళూరు వెళ్లడానికి ఇండిగో విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. డిపార్చర్ హాల్‌లో వేచి చూస్తుండగా ఆయన ప్యాంటులో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. పరిశీలించగా ఎలుక లోపలికి దూరి కరుస్తుందని గుర్తించాడు. వెంటనే అతను తన భార్య, ఇతర ప్రయాణికుల సహాయంతో ప్యాంటు విప్పి ఎలుకను పట్టుకున్నాడు. ఆ ఎలుక తొడను కరిచింది. పట్టుకున్న ఎలుకను కవర్లో ఉంచి విమానాశ్రయ సిబ్బందికి అప్పగించారు. అక్కడ రేబిస్ ఇంజెక్షన్ అందుబాటులో లేకపోవడంతో ప్రాథమిక చికిత్స అనంతరం అరుణ్ బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరు విమానాశ్రయంలో రేబిస్ ఇంజెక్షన్ తీసుకున్నారు. భోపాల్‌కు చెందిన అరుణ్ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చాట్‌జీపీటీ సాయంతో రూ. 1.32 కోట్ల లాటరీ గెలిచిన మహిళ
Sink Hole: నడిరోడ్డుపై పేద్ద.. గొయ్యి.. పదుల సంఖ్యలో పడ్డ వాహనాలు
గ్యాస్ బండ పేలితే.. పరిహారం చెల్లించాల్సిందే
కన్న కూతురినే.. కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు కారణం తెలిసి అంతా షాక్
ఒంటిమిట్టలో అద్భుతం..600 అడుగుల రామయ్య విగ్రహం