విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్న 13 ఏళ్ల బాలుడు.. ఎంత దూరం ప్రయాణించాడో తెలిస్తే..

విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్న 13 ఏళ్ల బాలుడు.. ఎంత దూరం ప్రయాణించాడో తెలిస్తే..


ఇది ఒక అద్భుతం వంటిది. నమ్మశక్యం కానిది, ఎవరూ ఊహించలేనిది… విమానయాన చరిత్రలోనే ఇలాంటి స్పెషల్ కేసు గురించి మీరు ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. కాబూల్ నుండి ఢిల్లీకి వచ్చిన KAM ఎయిర్ విమానం RQ-4401 ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు దాక్కున్నాడు. విమానం ఆదివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాక, అక్కడ బాలుడిని విమాన సిబ్బంది గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగినప్పుడు విమాన భద్రతా సిబ్బంది విమానం చుట్టూ తిరుగుతున్న ఒక పిల్లవాడిని గమనించారు. ఆ పిల్లవాడు టికెట్ లేకుండా వచ్చి ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అధికారులు అతని ఫోటోలు విడుదల చేసి వివరాలు వెల్లడించారు.

ఒక 13 ఏళ్ల బాలుడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో కాబూల్ నుండి వస్తున్న విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని భారతదేశానికి వచ్చాడు. ఈ సంఘటనలో సెప్టెంబర్ 21న ఉదయం 11:10 గంటల ప్రాంతంలో KAM ఎయిర్‌లైన్స్ విమానం (RQ-4401) ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఈ క్రమంలోనే విమాన భద్రతా సిబ్బంది విమానం చుట్టూ తిరుగుతున్న ఒక పిల్లవాడిని గమనించారు. ఆ పిల్లవాడు టికెట్ లేకుండా వచ్చి ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్నట్లు నిర్ధారించారు.. ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ఈ పిల్లవాడిని అదే రోజు మధ్యాహ్నం KAM ఎయిర్‌లైన్స్ తిరుగు ప్రయాణంలో (RQ-4402) కాబూల్‌కు తిరిగి పంపించారు.

ఇవి కూడా చదవండి

విచారణలో.. ఆ పిల్లవాడు కాబూల్ విమానాశ్రయంలో ప్రయాణికుల వెనుక కారు నడుపుతూ రన్‌వే వద్దకు చేరుకున్నానని వివరించాడు. ఆ తర్వాత ఎవరి కంటా పడకుండా తప్పించుకుంటూ విమానం ఎక్కి, టేకాఫ్‌కు ముందు చక్రంలో దాక్కున్నానని చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్ లోని కుందుజ్ కు చెందిన తాను ఇరాన్ కు వెళ్లాలనుకుంటున్నట్లుగా అధికారులతో చెప్పాడు. గంటన్నరకు పైగా  ఆ బాలుడు వీల్ వెల్‌లో ఎగిరి, అద్భుతంగా 1,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని తప్పించుకుని, ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో క్షేమంగా దిగాడు.  అయితే, అలాంటి స్థితిలో ప్రయాణించడం చాలా ప్రమాదకరం. దాదాపు బ్రతకటం అసాధ్యం అంటున్నారు.

విమానం టేకాఫ్ అయినప్పుడు టైర్ల దగ్గర ఆక్సిజన్ స్థాయిలు వేగంగా తగ్గుతాయి. ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థాయికి పడిపోతాయి. చక్రాల మధ్య చిక్కుకున్న వ్యక్తిని చక్రాలు ఢీకొంటే చనిపోవచ్చు అని నిపుణులు అంటున్నారు. టేకాఫ్ అయిన తర్వాత చక్రాలు వెనక్కి ముడుచుకున్నప్పుడు అక్కడ పూర్తిగా మూసివేయబడుతుందని విమానయాన నిపుణులు చెబుతున్నారు. ఆ లోపల ఒక మూలలో చిక్కుకున్న ప్రయాణీకుడు కొంతసమయం వరకు బతికి ఉండే అవకాశం ఉంది. కానీ 30,000 అడుగుల ఎత్తులో శ్వాస తీసుకోవడం, జీవించడం దాదాపు అసాధ్యం అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *